తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ట్యాగ్ ను సొంతం చేసుకుంది తమన్నా.

దాదాపు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ. తెలుగుతోపాటు తమిళ్ లోనూ తమన్నా సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది.

తమన్నా నటనతోనే కాదు.. తనఅందంతోనూ భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తాజాగా తమన్నా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ..

బోల్డ్ క్యారెక్టర్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

నేను హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది. నాకు సీనియారిటీ  పెరిగింది కాబట్టి దాన్ని కాపాడుకోవడం ఇప్పుడు నా బాధ్యత

అందుకే పాత్రల ఎంపిక విషయంలో చాలా  జాగ్రత్తగా ఉంటున్నాను. నేను సెలక్ట్ చేసుకునే సినిమాలే నా సీనియారిటీని కాపాడతాయి అంటుంది

అలాగే కథ డిమాండ్ చేస్తే గ్లామర్ షో చేయడానికి నేను సిద్ధమే. కానీ బోల్డ్ రోల్స్ కు మాత్రం నో చెప్పేస్తా.

తమన్నా ఏంటి ఇలాంటి పాత్రలో నటించింది అని నా ఫ్యాన్స్ నన్ను ఆదరించే ప్రేక్షకులు అనుకోకూడదు.

డబ్బు కోసం అలాంటి రోల్స్ ను ఎప్పటికీ చేయను అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.