'ఇవన్ వేరే మాదిరి' అనే తమిళ చిత్రంతో సినీ కెరీర్ ను ప్రారంభించింది అందాల ముద్దుగుమ్మ సురభి.

తెలుగులో సందీప్ కిషన్ నటించిన బీరువా సినిమాతో పరిచయం అయ్యింది.

ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'ఎక్స్ప్రెస్ రాజా' మూవీ తో హిట్ అందుకుంది ఈ చిన్నది.

ఈ సినిమా సక్సెస్ తర్వాత సురభికి ఆఫర్లు బాగానే వచ్చాయి.

ఈ క్రమంలోనే 'ఎటాక్' 'జెంటిల్ మేన్' 'ఒక్క క్షణం' 'ఓటర్' తదితర చిత్రాల్లో నటించింది.

తమిళంలోనూ ఈ అమ్మడు పలు సినిమాలు చేసింది. అక్కడా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు.

సురభి టాలీవుడ్ లో 'శశి' అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఆది సాయి కుమార్ హీరోగా నటించాడు.

ఈ మూవీ తర్వాత సురభి నుంచి మరో సినిమా వచ్చింది లేదు. కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన అనౌన్స్మెంట్లు రాలేదు.