కేజీఎఫ్ 2 సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో హీరోయిన్ శ్రీనిధి క్రేజ్ పెరిగిపోయింది.

సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలలో ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. కేజీఎఫ్ తర్వాత శ్రీనిధి వరుస ఆఫర్లు వచ్చాయి.

ఈ క్రమంలో తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీనిధి రెమ్యునరేషన్ టాక్ హాట్ టాపిక్‏గా మారింది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కోబ్రా సినిమా కోసం శ్రీనిధి కేజీఎఫ్ కంటే రెండింతలు ఎక్కువగా తీసుకుందట.

కేజీఎఫ్ సినిమాలో నటించినందుకు ఆమె రూ. 3 కోట్లు తీసుకుందట. ఇక ఇప్పుడు కోబ్రా మూవీ కోసం ఏకంగా ఆరు నుంచి ఏడు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుందని టాక్ వినిపిస్తోంది.

ఇక సినిమాలు లైన్లో పెడుతూ.. రెమ్యూనిరేషన్ పెంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తుంది.

కోబ్రా సినిమా తరువాత ఈ అమ్మడు ఇంక ఏ సినిమా అనౌన్స్ చెయ్యలేదు.. ఈ అమ్మడి తదుపరి మూవీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.