తెలుగు చిత్రపరిశ్రమలో ఇటీవల విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది హీరోయిన్ శ్రుతి హాసన్.
అటు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది శ్రుతి.
నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్లో ఉంటుంది.
తాజాగా అభిమానులతో ఇన్ స్టా వేదికగా చిట్ చాట్ నిర్వహించింది శ్రుతి. ఈ క్రమంలోనే నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలీలో స్పందించింది.
తాజాగా అభిమానులతో ఇన్ స్టా వేదికగా చిట్ చాట్ నిర్వహించింది శ్రుతి. ఈ క్రమంలోనే నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలీలో స్పందించింది.
ఇందులో ఓ నెటిజన్ నేను మీతో డేటింగ్ చేయాలనుకుంటున్నాను ?.. అంటూ కామెంట్ చేయగా.. నేరుగా నో అంటూ చెప్పేసింది.
ఆ తర్వాత మరో నెటిజన్ ఆర్ యూ వర్జిన్ ? అంటూ తిక్క ప్రశ్న వేశాడు. దీనికి శ్రుతి హాసన్ స్పందిస్తూ..
ముందు నువ్వు స్పెల్లింగ్ కరెక్ట్ రాయడం నేర్చుకో.. స్పెల్లింగ్ చూడూ అంటూ అతడికి కౌంటరిచ్చింది. .
అలాగే తన బాయ్ ఫ్రెండ్ శంతను హాజరికాతో కలిసి నెటిజన్ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ