తెలుగింటి అమ్మాయిలా అందరినీ ఆకట్టుకున్న ఒకనాటి పాపులర్ హీరోయిన్ సీత అందరికీ గుర్తుండే ఉంటుంది.
తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న లక్కీ హీరోయిన్ సీత. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించిన సీత ప్రముఖ నటులందరి సరసన నటించి పాపులర్ అయ్యారు.
కాగా 1990లో నటుడు పార్తీపన్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన పుదియపాదై చిత్రంలో ఆయనకు జంటగా నటించారు సీత. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.
దీంతో నటనకు దూరమయ్యారు. వారికి ముగ్గురు పిల్లలు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2001లో విడాకులు తీసుకున్నారు.
2010లో సురేష్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలువ లేదు. ఇక నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు.
తల్లిగా, సోదరిగా విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. వెండి తెరపైనే కాకుండా ఇటు బుల్లితెరపైనా నటిస్తున్నారు సీత.ఇదిలా ఉంటే 5 పదుల వయసులోనూ తనదైన అందంతో మెస్మరైజ్ చేస్తున్నారు
ఈ అందాల నటి. తాజాగా ఆమె స్పెషల్ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.