‘ఏం మాయ చేసావే’తో సినీ ఇండస్ట్రీలోకి సమంత ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే

ఈ మువీలో సమంత పోషించిన జెస్సీ పాత్రకు గాయని చిన్మయి గాత్రం ప్రాణం పోసింది

నాటి నుంచి సామ్‌ నటించిన అన్ని పాత్రలకూ చిన్మయి డబ్బింగ్‌ చెప్పడం ఆనవాయితీగా వస్తోంది

ఐతే ‘యూటర్న్‌’ నుంచి సామ్‌ తన పాత్రలకు తానే డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించింది

దీంతో సామ్‌-చిన్మయిల మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి

తాజాగా సామ్‌ - చిన్మయి గురించి తన ట్విటర్‌ ఖాతాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

చిన్మయిని క్వీన్‌ అంటూ  సమంత పోస్టు చేసిన ట్వీట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది