విరాటపర్వం తర్వాత న్యాచురల్‌ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) నటించిన చిత్రం గార్గి (Gargi).

గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహించారు. కోర్డు డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 15 థియేటర్లలో విడుదలైంది.

ఎలాంటి అంచనాల్లేకుండా విడుద‌లైన ఈ లేడీ ఓరియంటెడ్‌ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర మంచి వసూళ్లు సాధించింది.

కాగా థియేటర్లలో సందడి చేస్తోన్న గార్గి అప్పుడే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

ఆగస్ట్‌ 12 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలీవ్‌ ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది.

కాగా గార్గి సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుండడంతో భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని సమాచారం.