ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బన్నీ సరసన నటిస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి పుష్ప-2లో నటించనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం సుకుమార్ టీం ఆమె సంప్రదించిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.
అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.