జయం సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమయ్యింది సదా.

అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ సరసన ఛాన్స్ కొట్టేసి అగ్రకథానాయికగా దూసుకుపోతుంది.

చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

పలు షోలకు జడ్జిగానే కాకుండా , అటు వెబ్ సిరీస్‏లో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది.

తాజాగా తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. జీవితంలో అనేక కష్టాలు ఎదురైన సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలంటూ చెప్పుకొచ్చింది.

జీవితంలో అందరికీ ఉండాల్సిన లక్ష్యం సంతోషం. మీకంటూ ఆనందాన్ని ఇచ్చే విషయాలను, అభిరుచులను వ్యక్తులను గుర్తించి.. మీ మీలో ఉన్న ఆనందాన్ని వెతకండి.

మీ గమ్యానికి అడ్డుగా నిలిచే వ్యక్తులు అడుగడుగునా ఉంటారు. దీంతో జీవితంలో చిరాకు కలిగించే పరిసిత్థులు ఎదురవుతాయి.

మనశ్శాంతిగా ఉండాలంటే మీ చుట్టూ ఉన్న స్వా్ర్థపరులకు దూరంగా ఉండండి.” అంటూ రాసుకొచ్చింది.