డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో హీరోయిన్స్ రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శాకిని డాకిని.

సౌత్ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ గా వస్తుంది ఈ చిత్రం 

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ మూవీ సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హీరోయిన్ రెజీనా అసహనం వ్యక్తం చేసింది.

ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా అంటూ ఫైర్ అయ్యింది.

శాకిని డాకిని సినిమాలో మీ పాత్రకు ఓసీడీ ఉంది. నిజ జీవితంలో కూడా మీకు అలా ఓసీడీ అని రిపోర్టర్ ప్రశ్నించారు.

దీనిపై రెజినా రియాక్ట్ అవుతూ.. సినిమాలో అమ్మాయిల గురించి చాలా గొప్పగా చూపించాం. వాటి గురించి కాకుండా ఇలాంటి ప్రశ్నలు అడిగేది  అంటూ ఫైర్ అయ్యింది