చాలా కాలం తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో దూకుడు పెంచింది హీరోయిన్ రెజీనా కసాండ్రా.

ఇక ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శాకిని డాకిని.

ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సౌత్ కొరియా సూపర్ హిట్ మిడ్ నైట్ రన్నర్స్ చిత్రానికి రీమేక్‏గా వస్తోంది ఈ చిత్రం

ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా.. అబ్బాయిలపై ఫన్నీ కామెంట్స్ చేసింది.

నాకు అబ్బాయిల మీద పెద్ద జోక్ ఉంది. కానీ నేను వేయకూడదు ఇక్కడ.

అబ్బాయిలు.. మ్యాగీ రెండు నిమిషాల్లో అయిపోతాయి అంటూ కామెంట్ చేసింది. ముందు ఈ కామెంట్ యాంకర్‏కు అర్థం కాలేదు.

ఆ తర్వాత అర్థమైన యాంకర్ వద్దూ అంటూ డైవర్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.