పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

ప్రస్తుతం హీందీలో మూడు సినిమాల్లో నటిస్తోంది నేషనల్ క్రష్.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ తో కలిసి గుడ్ బై సినిమాలో నటించింది.

ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గోంటున్న రష్మిక.. తన మాజీ భాయ్ ఫ్రెండ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఏదైనా పార్టీలో మీ మాజీ భాయ్ ఫ్రెండ్ ఎదురుపడితే ఏం చేస్తారు అని అడగ్గా.. తనకు హాయ్ చెబుతానని తెలిపింది.

వారితో నేను ఇప్పటికీ స్నేహంగానే ఉన్నాను. మేము మంచి స్నేహితులం. అలాగే..

వారి కుటుంబంతో గతంలో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఇక భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుకుంటున్నాను.

వారితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది ” అంటూ చెప్పుకొచ్చింది.