ఒకప్పుడు క్రేజీ హీరోయిన్‌గా తన గ్లామర్ తో కుర్రకారును ఆకట్టుకుంది రంభ.
ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరం అయ్యింది ఆమె.
పెళ్లి తర్వాత కూడా పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తారక్ డాన్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది రంభ.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని అన్నారు నటి రంభ.
ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్‌లో నాచోరే నాచోరే పాట అంటే ఇష్టమని తెలిపారు.
ఎన్టీఆర్ డాన్స్ కన్నార్పకుండా చూస్తానని అన్నారు ఆమె.
ఎన్టీఆర్ డెడికేషన్ చూస్తే పిచ్చెక్కుతుందని మైకేల్ జాక్సన్ కన్నా తారక్ బెస్ట్ డాన్సర్ అని పేర్కొన్నారు రంభ.
అలాగే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ నటించాలనుందని తెలిపింది రంభ.
తనకు హీరోయిన్ త్రిష అంటే ఇష్టమని ఆమె ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుందని అన్నారు రంభ.