ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా రాణించారు నటి ప్రేమ
సుమారు 10 ఏళ్లకుపైగా వరుస సినిమాలు చేసిన ప్రేమ వివాహం తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది
అనంతరం 2017 మళ్లీ రీఎంట్రీ ఇచ్చినా.. ఆశించిన స్థాయిలో రాణించలేదు
ఇక భర్తకు కూడా విడాకులు ఇచ్చిన ప్రేమ ప్రస్తుతం ఒంటరిగానే ఉంది
తాజాగా మళ్లీ వివాహం చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు
ప్రస్తుతం తాను ఒంటరిగానే ఉంటూ.. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు చెప్పుకొచ్చారు