టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటి ప్రగతి.

తెలుగు తెరపై తల్లి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో  ఆమె సినీ కెరీర్‌లో ఎదురైన క్యాస్టింగ్‌ కౌచ్ వేధింపుల గురించి తెలిపారు.

ఓ మూవీ సెట్‌లో ఓ స్టార్ కమెడియన్ చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పుకొచ్చారు ఆమె.

ప్రగతి మాట్లాడుతూ..' ఆయన సెట్‌లో నాతో చాలా బాగా మాట్లాడతారు. చాలా పద్ధతిగా ఉంటారు.

అయితే ఒకరోజు  నాతో మిస్ బిహేవ్ చేశాడు. ఆ తర్వాత దాన్ని జీర్ణించుకోవడం నా వల్ల కాలేదు.

ఆ రోజు నాకు ఏం వర్క్ చేయాలనిపించలేదు. లంచ్ చేయలేకపోయా. ఆఖరికి టీ కూడా తాగాలనిపించలేదు.' అని తెలిపారు.

ఆ తర్వాత 'ఆయన షూటింగ్ అయిపోయి వెళ్లిపోతుంటే క్యారవాన్‌లోకి తీసుకెళ్లి ప్రశ్నించా. మీతో ఎప్పుడైనా మిస్ బిహేవ్ చేశానా అడిగా.

నేను అక్కడే రియాక్ట్ అయితే మీ పరిస్థితి ఏంటని నిలదీశా. మీరు కాబట్టే ఒక్క నిమిషం అలా సైలెంట్‌గా ఉండిపోయా.' అని తెలిపారు.

కాగా ఆమెతో మిస్ బిహేవ్ చేసిన స్టార్ కమెడియన్ ఎవరన్నది చెప్పలేదు.