సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రాణిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. వీరిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు ప్రగతి.
హీరోలకు అమ్మగా, అత్తగా, వదినగా, పిన్నిగా పలు రకాల క్యారెక్టర్స్ లో అలరించారు ప్రగతి. తనదైన సహజ నటనతో సినిమాల్లో రాణిస్తున్నారు.
ప్రగతి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.. .
నాలుగు పదుల వయసులోనూ అందంగా కనబడటమే కాకుండా ఫిట్నెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు
ప్రగతి వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిందే.. ఆమె తన భర్తతో విడాకులు తీసుకొని విడిగా జీవిస్తున్నారు.
అయితే గతంలో చాలా సందర్భాల్లో ప్రగతి రెండో పెళ్లి పై వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె రెండో పెళ్లి గురించి మరోసారి ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ఆమె రెండో పెళ్లి విషయం పై స్పందిస్తూ..పెళ్లి అని కాదు కానీ కంపానియన్ ఉంటే బాగుండేది అని చాలాసార్లు అనుకున్నా..
అయినా నా మెచూరిటీ లెవల్ కు తగ్గవాడు దొరకడం కష్టమే.. కానీ.. రావాలని ఉంటే మాత్రం అదే జరుగుతుంది అని నేను నమ్ముతాను.
నాకంటూ కొన్ని విషయాల్లో చాలా పర్టిక్యులర్ గా ఉంటాను. నేను 20 ఏళ్ల వయసులో ఉండిఉంటే అడ్జెస్ట్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు కష్టం.. అని చెప్పుకొచ్చింది ప్రగతి.