పరిణితీ చోప్రా.. ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ పంజాబీ బ్యూటీ
తన అందంతో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు హిట్ చిత్రాలతో మంచి జోరుమీదున్న ఈ భామ వరుసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉంది.
తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన పరిణితీ చోప్రా రిలేషన్ ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో జరుగుతున్న పెళ్లిళ్ళు చూస్తుంటే నాకూ పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది.
ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నాను. త్వరలో మింగిల్ అవ్వాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
ఆలియా, కియారా, అతియా శెట్టీల పెళ్లి ఫోటోలు చూస్తుంటే నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది” అని పరిణితీ చోప్రా చెప్పుకొచ్చింది.
గతంలో ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నానని, కానీ ఇప్పుడు పెళ్లికి సిద్దంగా ఉన్నాను అని పరిణితీ పేర్కొంది.
అనంతరం ఫ్యాన్స్ ను ఉద్దేశించి ‘నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారు? మంచి అబ్బాయి ఉంటే చూడండి’ అంటూ నవ్వుతూ.. కుర్రాళ్లకు వలపు వల విసిరింది.