మెంటల్ మదిలో సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు హీరోయిన్‏గా పరిచయమైంది నివేదా పేతురాజ్

మొదటి సినిమాతోనే నటన పరంగా ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత.. బ్రోచేవారెవరురా మూవీలో నటించి మెప్పించింది.

త్రివిక్రమ్.. అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అల .. వైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరోయిన్‏గా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.

ఈ సినిమా తర్వాత తెలుగులో నివేదాకు వరుస ఆఫర్స్ తలుపుతట్టాయి. ఇటీవల విశ్వక్ సేన్ సరసన పాగల్ మూవీలో నటించింది.

అయితే ఈ సినిమా ఆశించినంతగా హిట్ కాలేదు కానీ.. నివేదా క్రేజ్ మాత్రం తగ్గలేదు.

కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ నివేదాకు క్రేజ్ ఎక్కువగాన ఉంది.