లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ కనెక్ట్.
ఈ సినిమాను ఈ నెల 22న యూవీ క్రియేషన్స్ తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసింది. మొదటి రోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఇక మరోసారి తన నటనతో ప్రశంసలు అందుకుంది నయన్.
ఈ సినిమాను నయన్ భర్త విఘ్నేష్ శివన్ నిర్మించారు. ఇక విడుదలైన రెండో రోజే ఈ మూవీ ఓటీటీ పార్టనర్ ఫిక్స్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఇక థియేట్రికల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారట.
ప్రస్తుతం వెండితెరపై మంచి టాక్, కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం అటు ఓటీటీలోనూ సత్తా చాటుతుందో లేదో చూడాలి.