మలైకా అరోరా. తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతిథి’లో తొలిసారి తళుక్కుమంది. ఆ తర్వాత పవన్ కళ్యాన్ 'గబ్బర్ సింగ్‌' సినిమాలో ప్రేక్షకులతో కెవ్వుకేక పెట్టించిన సంగతి తెలిసిందే.

గత కొన్నేళ్లుగా ఈమె అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఈమె గర్భవతి అయినట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా మలైకా జిమ్‌‌కు వెళుతూ  పొట్ట కనపడకుండా దాచుకోవడంతో చాలా మంది ఈమె గర్భవతి కావడంతో అలా దాచుకుంటూ వెళ్లింది అంటూ కామెంట్స్ చేసారు.

వయస్సు 40 పై ఉన్న తనదైన అందంతో ఇప్పటికి కుర్రకారును బేజారెత్తిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక అర్జున్ కపూర్ ద్వారా ఈమె గర్భం దాల్చినట్టు వచ్చిన వార్తలపై ఈమె ఎలాంటి స్పందన లేకపోయినా ఇది నిజమో కాదో ఇంకా తెలియడం లేదు అంటు కామెంట్స్ వస్తున్నాయి.

ఈ భామ హిందీ సినిమాల్లో నెంబర్ వన్ ఐటమ్ గర్ల్‌గా సత్తా చాటింది

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసమే లేదు.