ఖుష్బు ప్రస్తుతం ఆమె గోపీచంద్ నటించిన రామబాణంలో కనిపించనుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఖుష్బూ.. మాట్లాడుతూ.. 'మెగాస్టార్ ఓ లెజెండ్. ఆయనకు వర్క్‌పై ప్యాషన్. ప్రతి రోజు సెట్స్‌లో కొత్తగా కనిపిస్తారు.

ప్రతి రోజు ఇంకా ఏదైనా చేయాలని ఆరాటపడుతుంటారు. నా  జీవితంలో బిగ్గెస్ట్ డ్రీమ్ చిరంజీవితో రొమాన్స్ చేయడం.

ఇప్పటివరకు అది నెరవేరలేదు. స్టాలిన్‌లో మేము నటించాం.

కానీ ఆయనతో ఏదైనా లవ్ స్టోరీ లేదా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలని ఉంది. అది నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నా.

రామబాణం మూవీ ఫ్యామిలీ ఓరియంటెడ్‌ చిత్రం. ప్రతి సినిమాకు రిలీజ్ అయినప్పుడు సక్సెస్ అవ్వాలని కోరుకుంటా.' అని అన్నారు.