బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథానాయికలలో కృతి సనన్ ఒకరు (Kriti Sanon).

అతి తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

అందం, అభినయంతో చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంలోనూ నటిస్తుంది.

డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఈ క్రమంలో తాజాగా కృతి సనన్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన పెళ్లి స్వయంవరంలో హీరోస్ కార్తీక్ ఆర్యన్, ఆదిత్య రాయ్ కపూర్,

 సౌత్ హీరో విజయ్ దేవరకొండ (VIjay Deverakonda) ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అంతేకాకుండా విజయ్ అందంగా ఉంటాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.