దేవదాసు మూవీతో వెండి తెరకు పరిచయమైంది ఇలియానా

కెరీర్‌ తొలినాళ్లలోనే స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్‌ సంపాదించుకుంది

అనంతరం బాలీవుడ్ బాట పట్టిన ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది

 దీంతో క్రమంగా సినిమాలకు దూరమవుతూ వచ్చింది

అయితే సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది

ఈ క్రమంలోనే తాజాగా తాను తల్లి కాబోతున్నట్లు బాంబు పేల్చింది

 ‘లిటిల్‌ డార్లింగ్‌ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉన్నాను' అని రాసుకొచ్చింది

ఇలియానాకు వివాహం కాలేదన్న విషయం తెలిసిందే

 అయితే గత కొన్ని రోజులుగా కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి