మాస్ పాత్రలో నటి అంజలి..
కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం నటి అంజలి కీలక పాత్రలో కనిపించనుంది.
ఆమె పుట్టినరోజు పురస్కరించుకొని శుక్రవారం తన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్.
ఈ చిత్రంలో ఆమె రత్నమాల అనే పేరుతో ఓ విలేజ్ అమ్మాయిలా అంజలి కనిపించనున్నట్లు దీని ద్వారా తెలుస్తుంది.
ఈ చిత్రంలో అంజలి పాత్ర మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని తెలిపారు మూవీ మేకర్స్.
ఇది ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో ఓ క్రూరమైన పాత్రలో విశ్వక్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.
ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.
మరిన్ని విషయాలు త్వరలో వెల్లడించనుంది చిత్రబృందం.