29 February 2024

గ్లామర్ డోస్ పెంచేసిన అంజలి.. ఇలా చూస్తే పడిపోని కుర్రాడు ఉంటాడా..?

Rajeev 

తెలుగమ్మాయి అయినా తమిళ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ అంజలి. తమిళ్ సినిమాలతోనే పరిచయం అయ్యింది. 

అంజలి తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామంలో జన్మించింది ఈ ముద్దుగుమ్మ 

డిగ్రీ చేస్తూనే షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించింది ఈ బ్యూటీ. షార్ట్ ఫిలిమ్స్ నుంచి మెల్లగా సినిమాల్లోకి వచ్చింది అంజలి.

తొలుత జీవా సరసన తమిళంలో ఒక సినిమాలో నటించింది.  అదే తెలుగులో   'డేర్' అనే టైటిల్ తో డబ్ అయ్యింది. 

2006లో 'ఫొటో' సినిమాతో స్వప్నగా అందరికీ పరిచయమైంది. 2007లో 'ప్రేమలేఖ రాశా'.. సినిమాలో సంధ్యగా కనిపిచింది. 

ఆతర్వాత నటించిన 'షాపింగ్‌మాల్' సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది అంజలి. ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా అంజలి మతిపోగోట్టే ఫోటోలను షేర్ చేసింది. గ్లామర్ గేట్లు ఎత్తేసి వయ్యారాలు ఒలకబోసింది అంజలి.