నటి అంజలి పరిచయం అక్కర్లేని పేరు. అటు టాలీవుడ్.. ఇటు కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్నారు.
ఇటీవల ఆమె సినిమాలు చేయకపోయినా.. వెబ్ సిరీస్ ఝాన్సీతో ప్రేక్షకులను అలరించింది.
ఇదిలా ఉండగా అరెంజ్‌డ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఆమె తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే పెళ్లాడబోతోందని సమాచారం.
అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అంజలి తల్లిదండ్రులు యుఎస్‌లో ఉన్నారు.
గతంలో పలుసార్లు పెళ్లి వార్తలొచ్చినప్పటికీ మరోసారి పెళ్లి చేసుకోబోతోందని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్ మూవీ ఆర్‌సీ15లో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అంజలి పెళ్లి చేసుకోనుందని సమాచారం.