అదితి రావు హైదరీ.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.

అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫాంలో సందడి చేస్తుంది.

తాజాగా ఇంటర్య్వూలో అదితి మాట్లాడుతూ.. రియల్ లైఫ్ లవ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

అనార్కలి లాంటి ప్రేమను తాను ఇప్పటికీ విశ్వసిస్తానని.. కథ.. సరికొత్త పాత్ర పట్ల తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపింది.

మేము మొఘల్‏ల కథతో సాంస్కృతికంగా అనుసంధానించబడ్డాము. ఇక్కడ ఎప్పటికీ నమ్మలేని ఓ ప్రేమకథ ఉంది. దానిని కొందరు నమ్మడం లేదు.

అలాంటి వారితో మేము కొన్నాళ్లు కలిసి ప్రయాణించాము. డైరెక్టర్ రొనాల్డ్ స్కాల్పెల్లో ‘అనార్కలి ఒక విషాద కథానాయిక’ అని చెబుతుంటాడు.

కానీ ఆమె విషాద కథానాయిక కాదు. ప్రేమకు అండగా నిలిచిన ధైర్యమైన అమ్మాయి. ఎంత అద్భుతమైన అమ్మాయి అంటే ప్రేమ కోసం ఎదురించింది తను.