సినీ తారల జీవితాల్లో ప్రేమ, పెళ్లి, విడాకులు.. రీల్ లైఫ్ మాదిరి రియల్ లైఫ్‌లో కూడా చకచకా జరిగిపోతాయి
ఆ తర్వాత మరెవ్వరితోనో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంటాయి
కొందరు అలాంటి పుకార్లను అవునని అంగీకరిస్తే.. మరికొందరు కాదని కొట్టిపారేస్తారు
ఈ మధ్య కాలంగా హీరో సిద్దార్ధ, హీరోయిన్ అదితిరావులపై ఇలాంటి రూమర్లు చాలానే వచ్చాయని చెప్పాలి
వీరిది ప్రేమా లేదా స్నేహమా అనేదానిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితిరావు క్లారిటీ ఇచ్చింది
నేను ఎవరితో ఏ రిలేషన్‌లో ఉన్నాను అనేదానిపై కాకుండా నా కెరీర్, మువీస్ గురించి మాట్లాడితే బాగుంటుంది
ప్రస్తుతం మంచి డైరెక్టర్లతో కలిసి పని చేస్తున్నాను. కెరీర్‌పైనే నా దృష్టి అంతా.. నన్ను నటిగా అంగీకరించినంతవరకు నటిస్తూనే ఉంటాను
నా వ్యక్తిగత విషయాల గురించి కాకుండా వృత్తిపరమైన విషయాల గురించి మాట్లాడండంటూ చెప్పుకొచ్చింది