తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు అదితి రావు హైదరీ. అందం, టాలెంట్ ఎంత ఉన్నా.. అవకాశాలు మాత్రం రావడం లేదు
కొద్ది రోజులుగా అదితి రావు హీరో సిద్ధార్థ్‌తో అదితి ప్రేమలో ఉందంటూ కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అదితి గురించి సిద్ధార్థ్ తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ రూమర్స్ పై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించలేదు.
తాజాగా తన రిలేషన్ షిప్ స్టేటస్ పై వస్తోన్న వార్తల గురించి అదితి రియాక్ట్ అయ్యారు. అలాంటి విషయం ఏదైనా ఉంటే తానే అందరితో చెబుతానని అన్నారు.
తాజ్ సక్సెస్ లో భాగంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సిద్ధార్త్ రిలేషన్ గురించి వస్తోన్న రూమర్స్ పై స్పందించాలని విలేకరి కోరగా..
మీకే ఒక అభిప్రాయం ఉంది.. ఇంకా నేనెమి చెప్పాలి. ఒకవేళ నేను ఏం చెప్పినా మీకు నచ్చిన విధంగా ఊహించుకుంటారు అంటూ అసహనం వ్యక్తం చేసారు.
దీంతో ఆడియన్స్ ప్రశ్న మేడమ్ అని అనగా.. అడియన్స్ ఎవరూ ఇలాంటి ప్రశ్న అడగలేదు.. మీరే నన్ను అడిగారు అని అన్నారు అదితి.