అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఆషికా. ఈ సినిమాలో ఆషికా నటనకు మంచి మార్కులే పడ్డాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆషికా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కాలేజీ రోజుల్లో అందాల పోటీల్లో సరదాగా పాల్గొంటే.. క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ అవార్డ్ వచ్చిందన్నారు.
ఆ ఫోటోస్ బయటకు వచ్చి.. క్రేజీ బాయ్ మూవీలో ఛాన్స్ వచ్చిందని.
తన సోదరి కూడా ఇండస్ట్రీలో ఉండడంతో తనకు సినిమాల్లో నటించాలని ఆసక్తి కలిగిందని అన్నారు.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పునీత్ రాజ్ కుమార్ తో కలిసి నటించాలనే కోరిక ఉండేదని.. తాను కోరుకున్నట్లే ఆయనను రెండుమూడు సార్లు కలిశానని తెలిపింది.
భవిష్యత్తులో రాజమౌళి మూవీలో నటించాలని ఉందని.. ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానని అన్నారు ఆషికా.