ప్రస్తుతం నార్త్ నుంచి సౌత్ వరకు లైగర్ మూవీ పేరు మారుమోగుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
విజయ్ తొలి పాన్ ఇండియా చిత్రంగా వస్తోన్న లైగర్‌కు ప్రమోషన్స్‌కు కూడా అదే రేంజ్లో చేస్తున్నారు మేకర్స్. సరికొత్త పంథాలో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
విజయ్ తన రిలేషన్‌పై ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. తనతో రిలేషన్లో ఉన్న వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకోవడం లేదంటూ, ఒక నటుడిగా పబ్లిక్ లైఫ్‌లో ఉండటానికి నాకు ఇష్టం ఉన్నా..
పబ్లిక్‌లో ఫోకస్ కావడం ఆమెకు నచ్చకపోవచ్చని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే తాను ఎవరితో ప్రేమలో ఉన్నాడన్న విషయాన్ని మాత్రం విజయ్ చెప్పలేరు.
లోకేశ్ కనగరాజ్‌తో సినిమా చేయాలనుందని విజయ్ తన కోరికను బయటపెట్టారు.
లైగర్ చిత్రం కోసం ఫిట్నెస్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపిన విజయ్, ఇందుకోసం మద్యం మానేశానని వివరించారు.