షార్ట్‌ ఫిల్మ్‌ ద్వారా కెరీర్‌ ప్రారంభించి టాలీవుడ్‌లో ట్యాలెంటెడ్‌ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్‌.

తాజాగా హీరోగా రైటర్ పద్మభూషణ్‌ మూవీతో హిట్ అందుకున్నడు. ఇలా మల్టీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌గా వరుస సినిమాలతో దూసుకెళుతోన్న సుహాస్‌

ఇదిలా ఉంటే సుహాస్‌ సినిమా లైఫ్ గురించి చాలా మందికి తెలుసు . అయితే అతని పర్సనల్ లైఫ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.

సుహాస్‌ నిజ జీవితంలో ఓ లవ్‌స్టోరీ ఉంది.. పెద్దలను ఎదిరించి మరీ మనసిచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

సుహాస్ లలిత అనే అమ్మాయిని ప్రేమించాడు. సుమారు ఏడేళ్ల పాటు వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే పెళ్లికి మాత్రం కుటుంబ సభ్యులు నో చెప్పారు.

దీంతో సుహాస్ స్నేహితుల సహాయంతో ఒక దేవాలయంలో లలితను వివాహం చేసుకున్నాడు. అలా వీరి ఏడేళ్ల ప్రేమకథ ఏడడుగుల బంధంగా మారింది.

కాగా లలిత తన జీవితంలోకి వచ్చిన తర్వాత బాగా కలిసొచ్చిందని ఒకనొక సందర్భంలో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు సుహాస్‌.

సోషల్‌ మీడియాలో తన సతీమణికి సంబంధించిన ఫొటోలను కూడా తరచూ షేర్‌ చేస్తుంటాడు సుహాస్‌.