ఎన్నో సినిమాల్లో తన అందచందాలతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రముఖ నటి రమ్యకృష్ణ. బాహుబలి సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది.

ఇదిలా ఉంటె రమ్యకృష్ణకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సూపర్ డీలక్స్ సినిమాలోని ఒక పోర్న్ స్టార్‌గా రమ్యకృష్ణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే..

నటిగా అపారమైన టాలెంట్ ఉన్న రమ్యకృష్ణ ఈ సినిమాలోని ఒక సీన్ కోసం ఏకంగా 37 టేకులు తీసుకున్నారట.

ఈ విషయంపై రమ్యకృష్ణ స్పందిస్తూ ‘ఇది నా కెరీర్లో ఛాలెంజింగ్ రోల్.. కొన్ని పాత్రలు పేరు కోసం.. మరికొన్ని డబ్బుకోసం.. ఇంకొన్ని పాత్రలు ష్యాషన్‌తో చేస్తాము..

అలా ఫ్యాషన్‌తో చేసిన పాత్రనే ఇది.. అని రమ్యకృష్ణ చెప్పడం.. అందరిలో మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఈ విషయం ఎప్పటిదో అయినప్పటికీ ఇప్పుడు రమ్యకృష్ణ అంతటి నటి కూడా ఇంతలా కష్టపడుతుందా అంటూ కొందరు ఈ వార్తను షేర్ చేస్తున్నారు.