ఎవరు, క్షణం, గూఢచారి వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో అడివి శేష్.
మేజర్ (Major) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ సక్సెస్ ఫుల్ గా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
తాజాగా తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు శేష్.
తన పెళ్లి కోసం ఇంట్లో వాళ్లు కూడా ఎదురుచూస్తున్నారని చెప్పారు.
లవ్ ఫెయిల్యూర్ గురించి స్పందిస్తూ నిజంగానే అలాంటి స్టోరీ ఉంది.. లవ్ లో దెబ్బతిన్నాను..
యూఎస్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను.. నా పుట్టినరోజు నాడే తన పెళ్లి జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు శేష్..