పసుపును శుభకార్యాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆహారానికి రంగును తీసుకురావడంతో పాటు శుభానికి చిహ్నంగా భావిస్తారు
ఇంట్లో పసుపు అయిపోవడం అశుభంగా పరిగణిస్తారు. అందువల్ల పసుపు పూర్తిగా అయిపోక ముందే తగిన చర్యలు తీసుకోవాలి
ఉప్పు వాస్తు శాస్త్రంలో ఉప్పు గురించి చాలా విషయాలు చెప్పారు. ఉప్పు అయిపోయినప్పుడు ఇంటి వంటగదిలోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది
దీని కారణంగా ఇంట్లో వాస్తు దోషం, డబ్బు సమస్యలు ఏర్పడుతాయి. ఆహారంలో ఉప్పు లేకుంటే రుచిని ఏ విధంగానైతే కోల్పోతారో జీవితం కూడా అలాగే తయారవుతుందని చెప్పారు
వంటగదిలో పిండి చాలా ముఖ్యమైనది. ఇది లేకుండా రొట్టె తయారు చేయలేము. కొన్నిసార్లు నెలాఖరులో పిండి అయిపోవచ్చు
కనుక ఎక్కువ పరిమాణంలో పిండి ఉండే విధంగా చూసుకోవాలి. వాస్తు ప్రకారం పిండి అయిపోవడం అశుభంగా పరిగణిస్తారు. ఇది గౌరవాన్ని కోల్పోయేలా చేస్తుంది
పూజలో బియ్యం వాడతారు. ఇంట్లో బియ్యం అయిపోతే శుక్ర గ్రహం ప్రభావితమవుతుంది
దీని కారణంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతాయి. అందుకే ఎల్లప్పుడూ మీ వంటగదిలో బియ్యం నిండుగా ఉండేలా చూసుకోవాలి