బరువు తగ్గడం కోసం కొందరు కడుపు మాడ్చుకుంటారు. మరికొందరు వ్యాయామాలు చేస్తుంటారు.

అయితే ఈ ప్రయత్నాలతో పాటు చక్కగా తగినంత నిద్రపోతే చాలు ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ కావచ్చని తేల్చింది తాజా అధ్యయనం.

మనిషి ప్రతిరోజూ ఎన్ని గంటలు నిద్రించాలి, నిద్రలేమి వల్ల కలిగే నష్టాలేంటి, హాయిగా తగినంత సమయం నిద్రపోతే కలిగే లాభాలేంటి అనే వివరాలను తాజా రిసెర్చ్ వెల్లడించింది.

తగినంత సమయం క్వాలిటీ స్లీప్ లేకపోతే జీవక్రియ లోపాలు, బరువు పెరుగుదల, ఊబకాయం వచ్చే ప్రమాదాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ స్టడీలో తేలింది.

 నిద్రలేమి వల్ల ఎక్కువ క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవాలనిపిస్తుందని, ఫలితంగా వెయిట్ గెయిన్ అవుతారని స్టడీ రిపోర్ట్ పేర్కొంది.

18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారికి ప్రతిరోజూ 7 గంటల పాటు క్వాలిటీ స్లీప్ అవసరం.

తగినంత సమయం నాణ్యమైన నిద్రపోతే అర్ధరాత్రి వేళల్లో మెలకువ రాదు. టైమ్ కాని టైమ్‌లో ఏదైనా తినాలనే ఆలోచన కలగదు.

సరిగా నిద్ర పట్టకపోతే మెటబాలిజం మెలకువతో ఉన్నప్పటి మాదిరిగానే పనిచేస్తుంది. ఫలితంగా డిన్నర్‌లో తిన్నది అరిగిపోయి.. మధ్య రాత్రి ఆకలిగా అనిపిస్తుంది.