గొప్ప పురాణాల్లో ‘గరుడ పురాణం’ ఒకటి. ఇందులో ఒక వ్యక్తి కర్మల ప్రకారం లభించే ఫలాల గురించి వివరంగా చెప్పబడింది

మనం చేసే పాపపుణ్యాలు స్వర్గం లేదా నరకానికి దిశనిర్దేశాలు అవుతాయని గరుడ పురాణం చెబుతోంది

ఒక వ్యక్తి చేయకూడనివి.. మహా పాపాలుగా భావించే ఆ తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం

పిండాన్ని, అప్పుడే పుట్టిన బిడ్డను, గర్భవతిని చంపడం మహాపాపంగా పరిగణించబడుతుంది. అలాంటి వ్యక్తులు మరణానంతరం అనేక రకాల శిక్షలను అనుభవిస్తారు

 స్త్రీని అవమానించి, దూషించేవారు, అలాగే రుతుక్రమంలో ఉన్న స్త్రీలను ఎగతాళి చేయడం, వారితో అసభ్యంగా ప్రవర్తించేవారి జీవితాలు నాశనం అవుతాయని గరుడ పురాణం చెబుతోంది

స్నేహితుడిపైనా, లేదా మరేదైనా స్త్రీపై దురుద్దేశంతో ఏదైనా చేయాలనుకున్న వారు నరకంలో కఠినమైన శిక్షలు అనుభవిస్తారు

బలహీనులను, వృద్ధులను, పేదవారిని వేధించేవారు, అలాగే వారిని దోపిడీ చేసేవారికి మరణానంతరం నరకం అనుభవించాల్సి ఉంటుంది

దేవాలయాలను, మత గ్రంధాలను ఎగతాళి చేసేవారిని పాపులుగా పరిగణిస్తారు. ప్రజలకు సరైన మార్గాన్ని చూపడానికి గ్రంథాలు ఉన్నాయి

 అలాగే వ్యక్తిలో సానుకూలతను తీసుకురావడానికి, వారిని ధర్మమార్గంలోకి తీసుకురావడానికి ఆలయాలు నిర్మించబడ్డాయి

చాలామంది వీటిని దర్శించుకుంటారు. అలాంటి వాటిని అస్సలు ఎగతాళి చేయకూడదు. ఎగతాళి చేసినవారికి మరణానంతరం నరకంలో స్థానం లభిస్తుంది