ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో పక్షులకు ఉండే కొన్ని లక్షణాల గురించి కూడా ప్రస్తావించాడు
ఈ పక్షుల నుంచి మనిషి లక్షణాలను స్వీకరించడం ద్వారా.. ఆ వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు
ఒక వ్యక్తి ఏయే పక్షులలో ఏయే లక్షణాలను అలవర్చుకోవచ్చో తెలుసుకుందాం
కొంగకు తన ఇంద్రియాలను ఎలా నియంత్రించాలో తెలుసు
అదే విధంగా సంయమనంతో పని చేస్తే విజయం సులువుగా దొరుకుతుంది
ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వ్యక్తి ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటాడు
కాబట్టి మీ మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. ఏకాగ్రతతో పని చేయండి
సూర్యోదయానికి ముందే కోడిపుంజు లేస్తుంది. అంతేకాదు వ్యతిరేకశక్తులపై పోరాడుతుంది
ఆహారాన్ని పంచుకోవడం, మీ స్వంత శక్తితో ఆహారం పొందడం వంటి లక్షణాలన్నీ ఒక వ్యక్తి కోడి నుండి నేర్చుకోవచ్చు
ఈ లక్షణాలు మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి