మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ తమ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టిన విషయం విధితమే

 మిలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌తో 27 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించానని ప్రకటించారు

 2021 మే నెలలో బిల్‌గేట్స్‌ ఈ విషయాన్ని ప్రకటించారు

 అయితే తాజాగా బిల్‌గేట్స్‌ మళ్లీ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది

ఒరాకిల్‌ మాజీ సీఈవో దివంగత మార్క్‌ హర్డ్‌ భార్య పౌలా హర్డ్‌తో గేట్స్‌ ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారు

 గేట్స్‌, పౌలాల మధ్య రెండేళ్లుగా బంధం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది

వీరికి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి ఈ విషయాలను తెలిపినట్లు సమాచారం