ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు. ఎక్కడ ఏ మూల ఏం జరిగిన క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతుంది.
ఇక సెలబ్రెటీస్ పిల్లల పట్ల వచ్చే ట్రోలింగ్స్ గురించి చెప్పక్కర్లేదు. శరీరాకృతిపై.. డ్రెస్సింగ్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు.
తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాద్య తనపై వచ్చే తప్పుడు వార్తలపై హైకోర్టును ఆశ్రయించింది.
తన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై ఆరాధ్య ఫిర్యాదు చేయగా.. ఈ కేసు విచారణ ఈరోజు హైకోర్టులో జరగనుంది.
11 ఏళ్ల మైనర్ అయిన తన గురించి.. తన ఆరోగ్యం గురించి నిరాధారమైన రూమర్స్ యూట్యూబ్ ఛానెల్స్ ప్రసారం చేశాయని..
వాటిపై చర్యలు తీసుకోవాలని ఆరాధ్య తన ఫిర్యాదులో పేర్కొంది. నిజానికి ఆరాధ్య బచ్చన్ పై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావాలని ఆరాధ్యపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తుంటారు.
సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తుంటారు. తన కూతురిపై వచ్చే వార్తలు.. ట్రోలింగ్స్ పై విసుగుచెందిన అభిషేక్.. తన కూతురిని టార్గెట్ చేయడం మానుకోవాలని బాలీవుడ్ మీడియాను కోరారు.
బాబ్ బిస్వాస్ సినిమా ప్రమోషన్లలో అభిషేక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. “ఈ ట్రోల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదు. ఇలాంటివి చేసేవారిని క్షమించాల్సిన అవసరం లేదు.
నేనొక సినీ నటుడిని అయినంత మాత్రాన ఈ రంగంతో అస్సలు సంబంధంలేని నా కూతురిని టార్గెట్ చేస్తారా. నన్ను ఏమైనా అనాలనుకుంటే నా ముఖం మీద అనండి” అంటూ సీరియస్ అయ్యారు.