ప్రస్తుతం మోస్ట్ ఏవైటెడ్ మూవీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమా ఒకటి.

లాల్‌ సింగ్‌ చడ్డా(Laal Singh Chaddha) అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అమీర్.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరుతెచ్చుకున్న అమీర్ సినిమాల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆయన సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నప్పటీకీ ప్రేక్షకులను అలరించే సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

అయితే లాల్ సింగ్ సినిమాతో.. సూపర్ డూపర్ హిట్ కొడదామనుకున్నడు అమీర్

లాల్ సింగ్ చడ్డా ఆగస్టు  12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.