బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ లాల్‌సింగ్ ఛద్దా తర్వాత సినిమాలకు కొంతదూరంగా ఉంటున్నారు
ఈ మధ్యకాలంలో కూతురు ఇరాఖాన్ నిశ్చితార్థ వేడుకలో కనిపించారు
పదేళ్ల పిల్లాడిగా ఉన్న సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు
అమీర్ ఖాన్ తండ్రి తాహిర్ హుస్సేన్ ‘లాకెట్’ మువీని చిత్రించే రోజుల నాటి సంగతులు
నటీనటులు జితేంద్ర, రేఖ, ఖాదర్‌ఖాన్ వంటి వారు సరిగా డేట్లు ఇవ్వకపోవడంతో షూటింగ్ ఎన్నోసార్లు వాయిదా పడిందట
దీంతో ‘లాకెట్’ మువీ చిత్రీకరణకు దాదాపు ఎనిమిదేళ్లు పట్టిందట
ఆ సమయంలో ఆమిర్‌ఖాన్ తండ్రి ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు చూసి ఏమీ చేయలేక మథనపడిపోయేవాడినని కన్నీళ్లు పెట్టుకున్నారు