ప్రతి ప్రభుత్వ పథకానికి, బ్యాంక్ ఖాతా, రిజిస్ట్రేషన్లకు, ఇతర పనులకు ఆధార్ తప్పనిసరి

అయితే, ఆధార్ కార్డ్ విషయం విషయంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు

మీరు చేసే తప్పులు మీ బ్యాంక్ అకౌంట్‌ను ఖాళీ చేస్తుంది

ఆధార్ విషయంలో చేయకూడని తప్పులేంటో తెలుసుకుందాం

మీ ఇ-ఆధార్ కార్డ్‌ని సైబర్ కేఫ్, తెలియని వ్యక్తులు సిస్టమ్స్‌ నుంచి డౌన్‌లోడ్ చేయొద్దు. అలా చేయడం వల్ల మీ ఆధార్ కార్డు దుర్వినియోగం కావచ్చు

తెలియని వారికి మీ ఆధార్ కార్డ్ ఒరిజినల్, జీరాక్స్ కాపీ ఇవ్వద్దు. అలా చేస్తే మీరు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది

ఏదైనా పని నిమిత్తం ఎవరికైనా ఆధార్ కార్డు కాపీ ఇవ్వాల్సి వస్తే ఆ విషయాన్ని అందులో రాయండి. తద్వారా ఎవరూ ఇతర పనులకు ఉపయోగించలేరు

మీ ఆధార్ కార్డ్‌ని సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు ఆధార్‌లో ముసుగు వేసుకోవచ్చు. ఇందులో ఏం జరుగుతుంది అంటే ఆధార్ కార్డ్‌లోని 12 అంకెలలో ప్రారంభ 8 అంకెలు కనిపించవు, దాని కారణంగా అది సురక్షితం అవుతుంది