దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయినా స్టేట్ ఎస్‌బీఐ కీలక ప్రకటన చేసింది.
రూ.2 వేల నోట్ల మార్పడికి సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని తెలిపింది.
ఆర్‌బీఐ మే 23 నుంచి బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించింది.
ఈ ప్రక్రియ సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతున్న సంగతి తెలిసింది.
అయితే కేవలం వారం రోజుల్లో రూ.2 వేల నోట్లను రికార్డ్ స్థాయిలో మార్చుకున్నారు ప్రజలు.
దాదాపు రూ. 17 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లను ఖాతాదారులు డిపాజిట్ చేశారని వెల్లడించింది ఎస్‌బీఐ.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2016 పాత రూ. 500 నోట్లు, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.
వాటి స్థానంలో కొత్తగా రూ. 2 వేల, రూ. 500 నోట్లను తీసుకువచ్చిది కేంద్రం.
తాజాగా ఆర్‌బీఐ రూ. 2 వేల నోట్లను ఉపసంహరిచుకున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ప్రజలు బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు.