దాదాపు మూడున్నర కిలోల బరువుండే అరుదైన జాతి పాములాంటి చేపలను మత్స్యకారులు పట్టుకున్నారు

సుందర్‌బన్స్‌లోని రాయమంగల్ నదిలో మత్స్యకారుల వలలో 6 అడుగుల పాములాంటి అరుదైన చేప చిక్కింది

బసిర్‌హట్‌లోని మారుమూల సుందర్‌బన్స్‌లోని హింగల్‌గంజ్‌లోని రాయమంగల్ నదిలో మత్స్యకారుడు అనుప్ మండల్ వలలో భారీ చేప చిక్కుకుంది

చేప చూసేందుకు దాదాపు పాములాగే కనిపిస్తుంది

స్థానికులు ఈ చేపను 'సత్ హతి'గా పిలుస్తారని సమాచారం. చేప శాస్త్రీయ నామం మోనోప్టెరస్ కుచియా

ఈ చేప సాధారణంగా భారతదేశం, బంగ్లాదేశ్‌లోని సుందర్‌బన్స్ ప్రాంతంలోని ఉప్పునీటి నదులలో కనిపిస్తుంది

హింగల్‌గంజ్‌లోని అంబేరియా మార్కెట్‌కు చేపలను తీసుకురాగా, వాటిని చూసేందుకు జనం గుమిగూడారు

అయితే, ఈ అరుదైన చేపల ధర మాత్రం తెలియలేదు. హసనాబాద్ మత్స్యశాఖకు వీటిని విక్రయించినట్టుగా తెలిసింది