‘మాస్టర్‌’ తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ మరో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే

‘#దలపతి 67’ వర్కింగ్‌ టైటిల్‌తో ఇటీవల పట్టాలెక్కిన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది

ఈ చిత్రంలో సంజయ్‌దత్‌, అర్జున్‌, గౌతమ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి

‘లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా వస్తున్న ఈ చిత్రంలో  కథానాయకిగా త్రిష నటిస్తున్నారు

అక్టోబరు 19న విడుదల కానున్న ఈ చిత్ర టైటిల్ ను తాజాగా మూవీ యూనిట్ ప్రకటించింది

ఈ మూవీకి ‘లియో: బ్లడీ స్వీట్‌’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్

అయితే ఈ చిత్రానికి ‘రెడ్‌ కోడ్‌’ అనే టైటిల్ పెట్టుంటారంటూ చాలామంది విజయ్‌ ఫాన్స్  గురువారం సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో వైరల్‌ చేశారు

ఎవ్వరు ఊహించని టైటిల్‌ ఫిక్స్ చెయ్యడంతో అభిమానులు సర్‌ప్రైజ్‌ ఫీలవుతున్నారు