అందమైన ముఖ వర్చస్సు ఉండాలని ప్రతి మగువ కోరుకుంటుంది. అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది

వాతావరణంలోని కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన శైలి చర్మం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ముఖంపై మచ్చలు, మొటిమలు ఏర్పడతాయి

వంటింట్లో దొరికే సహజమైన పదార్ధాలను ఉపయోగించి మొటిమలు, మచ్చలు లేని అందమైన ముఖ వర్చస్సు మీ సొంతం చేసుకోవచ్చు మరి ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందామా

ఒక టమాటా తీసుకుని దానిని కట్ చేసి.. దాని నుంచి రసం వేరుచేసుకుని ఉప్పు వేసి మిక్స్ చేయాలి. ఆ మిశ్రమాన్ని సున్నితంగా ముఖంపై అప్లై చేయాలి

ఇది ముఖంపై సహజ బ్లీచింగ్ లా పనిచేస్తుంది. ముఖంపై విటమిన్ సి వలన మృతకణాల్ని తొలగిస్తుంది. ముఖం మెరుపును సంతరించుకుంటుంది

ఉప్పు యొక్క ఖనిజ కంటెంట్ చర్మంలో రక్షణ అవరోధం పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. అది హైడ్రేటెడ్గా ఉండేందుకు సహాయపడుతుంది

పసుపు, శనగపిండి కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసుకొని.. కొంచెం ఆరిన తరువాత నీటితో తడుపుతూ బాగా మసాజ్ చేయాలి

నెమ్మదిగా సర్కులర్ మోషన్ లో చేతి వేళ్లతో మసాజ్ చేయడం వలన చర్మకణాలు శుభ్రపడి ముఖం కాంతివంతంగా, తాజాగా తయారవుతుంది