ఒక వ్యక్తికి పాము కరిస్తే ఏం చేస్తాం వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తాము.
కానీ ఓ 8 ఏళ్ల బాలుడు మాత్రం కాటేసిన పాముపైనే పగబట్టాడు.
తనను కాటేసి అక్కడి నుంచి పారిపోతున్న పామును పట్టుకుని తన నోటికి కరిచి చంపేశాడు.
దీనిని చూసి షాక్‌కు గురైన బాలుడి తల్లిదండ్రులు వెంటనే బాలున్ని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనల ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
పహారి కోరువ అనే కుటుంబానికి చెందిన 8 ఏళ్ల బాలుడు దీపక్ పిల్లలతో ఆడుకుంటూ ఉండగా అతని పాము కాటు వేసింది.
దీంతో దీపక్‌కు పాముపై కోపం వచ్చింది. వెంటనే ఆ పామును పట్టుకుని కోరికేశాడు. వెంటనే పాము మృతి చెందింది
ఈ గిరిజన జిల్లాలో పాములు అధికంగా ఉంటాయట. అందుకే ఈ ప్రదేశాన్ని నాగ్లోక్ (పాముల నివాసం) అని కూడా పిలుస్తారు.