Food for Heart: గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలు.. తిన్నారంటే నిశ్చింతగా ఉండొచ్చు..

వాల్నట్స్ వాల్నట్స్ తింటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ఇంకా ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, ప్లాంట్ స్టెరాల్స్, ఫైబర్ మీ గుండెను కాపాడతాయి.

ఆలివ్ నూనె ఆలివ్‌ నూనె కూడా శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెను కాపాడడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

నారింజ నారింజలోని పోషకాలు.. ముఖ్యంగా విటమిన్ సీ శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇంకా గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.

డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్‌లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె పనితీరును మెరుగుపరిచి, ఆరోగ్యాన్ని కాపాడతాయి.

తృణధాన్యాలు శరీరానికి, ముఖ్యంగా గుండెకు తృణధాన్యాలు చాలా ప్రయోజకరం. ఇందుకలోని పోషకాలు ఈ పనిలో సహాయపడతాయి.

టమోటాలు టమోటాలు శరీరంలో రక్తం స్థాయిలను పెంచడమే కాక గుండె సంబంధిత వ్యాధులను కూడా నిరోధిస్తుంది.

బెర్రీలు ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగిన బెర్రీస్‌ మన గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

వెల్లుల్లి అనేక యుగాలుగా వంటల్లో వాడుతున్న వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి  ఎంతగానో సహాయపడుతుంది. వెల్లుల్లిలోని అల్లిసిన్ గుండె సంబంధిత రోగాలను నిరోధిస్తుంది.