శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే.. అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి

శరీరంలో ప్రొటీన్ లోపానికి అనేక కారణాలున్నాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రొటీన్ లోపంగా పరిగణించవచ్చు

కొన్నిసార్లు బాగా ఆకలి పెరుగుతుంది. కడుపునిండా తిన్నా.. అప్పుడు కూడా ఆకలి వేస్తే ప్రొటీన్ లోపం ఉన్నట్లే అర్ధం చేసుకోవాలి

చేతులు, కాళ్లలో దురద, మంట, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

శరీర బలం, కండరాల బలహీనత, శక్తి తగ్గితే ప్రొటీన్ లోపం ఉన్నట్లే

గోళ్లు రంగు, ఆకారం మారితే ప్రొటీన్ లోపం ఉన్నట్లే.. గోళ్లు అకస్మాత్తుగా తెలుపురంగులోకి మారుతాయి

ప్రొటీన్ లేకపోవడం వల్ల కాలేయం మీద ఒత్తిడి పడుతుంది. చేతులు, కాళ్లు వాపు కనిపిస్తుంది

రోజంతా అలసట, నీరసం, ఆకలి లేకపోవడం కూడా ప్రొటీన్ లోపం లక్షణాలే.. ఇలాంటివి కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి